విశ్వాధిపతి.. సర్వలోకమునేలే..| Ps. Israel | Viswadhipati

Lyric:
విశ్వాధిపతి సర్వలోకమును ఏలే యేసయ్యా 
నీ విశాల సామ్రాజ్యములో 
చీకటి తెరలు చీల్చుటకు 
నీ సైన్యాధిపతిగా నియమించూకొంటివి " 2 "

*సర్వలోక చక్రవర్తి - నీ సైన్యాధిపతినై*
*న్యాయాధిపతి సంస్థానములో*
*తుదవరకు పోరాడెద  "  విశ్వాధిపతి "*

 సంఘక్షేమముకు - విఘాతము కలిగించి
నీలినీడల మాటున 
భ్రమపరచి నడుపు విరోధితో     "  2  "
రక్తము కారునంతగా పోరాడుటకు 
దత్త పుత్రాత్మతో నింపి మహా రోషము నిచ్చి 
జిహ్వబలి సమరములో నిలిపితివి " 2 "

*సర్వలోక చక్రవర్తి - నీ సైన్యాధిపతినై*
*న్యాయాధిపతి సంస్థానములో*
*తుదవరకు పోరాడెద  "  విశ్వాధిపతి "*

స్వరక్తమిచ్చి కొన్న  గోధుమ పొలములో 
నిద్రించు కాలమందున 
గురుగులు చల్లిన విరోధితో      " 2 "
విశ్రాంతి లేకుండ పోరాడుటకు  
వాగ్ధాన బలముతో నింపి కృపతో నన్ను కప్పి 
పరుగు పందెములో నిలిపితివి  " 2 "

*సర్వలోక చక్రవర్తి - నీ సైన్యాధిపతినై*
*న్యాయాధిపతి సంస్థానములో*
*తుదవరకు పోరాడెద  "  విశ్వాధిపతి "*
 
సమస్త జనములకు వ్యభిచార మద్యమును 
త్రాగించి చెరిపేసిన 
సాతాను దుర్గములు పడద్రోయుటకు " 2 "
ప్రశస్తమైన రత్నములతో నాకు 
సరిహద్దులేర్పరచి నీలాంజనములతో కట్టి 
యుద్దోపకరణములు ఇచ్చితివి      " 2 "

*సర్వలోక చక్రవర్తి - నీ సైన్యాధిపతినై*
*న్యాయాధిపతి సంస్థానములో*
*తుదవరకు పోరాడెద  "  విశ్వాధిపతి "*


రచన , స్వరకల్పన , గానం - పాస్టర్ . ఇశ్రాయేలు గారు ( ముత్తుకూరు)
    న్యాయాదిపతి మినిస్ట్రీస్