కునుకకా నిదురపోకా || Kunukaka Nidrapoka || Bro Nissy John || Padala Suresh Babu

Lyric:
*కునుకకా నిదురపోక*
*సంవత్సరమంతా కాచికాపాడిన దేవా*
*నీ ప్రేమకు వందనం*
*విడువక చేయి వదలకా*
*నీ రెక్కల క్రింద దాచిన దేవా*
*నీ కృపకు స్తోత్రం  "  కునుకకా "*
*వందనం  వందనం వందనం*
*స్తోత్రము స్తోత్రము స్తోత్రము "2"*

బ్రతుకు దినములన్నీ.......
కరువు అనేది రాకుండా 
నా సహాయకుడిగా పోషించినావు
నా ఇరుకు మార్గమును....
విశాలపరచి నన్ను నీతో నడిపించినావు "2"
పాతవి గతియింపజేసి క్రొత్తవిగా మార్చి
నూతన సృష్టిగా నన్ను మార్చినావు " 2 " 
*వందనం  వందనం వందనం*
*స్తోత్రము స్తోత్రము స్తోత్రము "2"*   
                               *"  కునుకకా  "*
                              
జీవించు క్షణములన్నీ.....
విడువక తోడై అద్భుత కార్యలేన్నో 
నాపై చేసావు 
క్షమియించు గుణము నిచ్చి.....
నీ పరిచర్యలో సంవత్సరమంతా 
నన్ను వాడుకున్నావు   " 2 "
నూతన వత్సరం నాకు దయచేసి
నీ దయా కిరీటం నాపై వుంచావు " 2 "
*వందనం  వందనం వందనం*
*స్తోత్రము స్తోత్రము  స్తోత్రము "2"*
                                 *"  కునుకకా  "*

గానం : Bro Nissy John 
రచన, స్వరకల్పన - పడాల సురేష్ బాబు,విశాఖపట్నం.
సంగీతం - Devanand,  విశాఖపట్నం.