నిన్ను చూడాలని నాకు ఆశ.. | SP. Balasubramanyam | Ninnu Padalani

నిన్ను చూడాలని నాకు ఆశ

నిన్ను పాడాలని నా ధ్యాస

నిన్ను చేరాలని నీతో ఉండాలని

నా బ్రతుకంతా నిను పాడని

 

బ్రతుకులో అడుగు అడుగున నిన్ను పోలి నడవాలని

ప్రేమలో నీవు చూపిన మాదిరి నేను చూపాలని

ఆశ ఉన్నదీ అది నీతోనే ఉన్నదీ

 

శ్రమలలో నేను నిన్ను దూషణ చేయక నిలవాలని

సహనములో నాలో నిన్ను పొరుగువారికి చూపాలని

ఆశ ఉన్నదీ అది నీతోనే ఉన్నదీ

 

కలిమిలో అహము చెందక నీదు కృప చూపాలని

లేమిలో కలత ఛేదనక యేసు నీవైపు చూడాలని

ఆశ ఉన్నదీ అది నీతోనే ఉన్నదీ