ఓ ఆకాశమా ఆలకించుమా.. | Aakasamaa

ఓ ఆకాశమా ఆలకించుమా.. | Aakasamaa

ఓ ఆకాశమా ఆలకించుమా - ఓ భూమి చెవియొగ్గుమా 

పిల్లలును పెంచి - గొప్పగా చేసితిని 

వారు నా మీదా - తిరుగుబాటుచేసితిరి  

లెక్కలేనన్ని దినములు - నను మరచియున్నారు 

దినమెల్ల చేతులు చాచి - నిలిచియున్నాను 

ఓ ఆకాశమా - ఓ భూలోకమా 

 

పర్వతములన్నిటిని పుట్టించిన వాడను నేనే

సంద్రములాంటిని నియమించివాడను నేనే 

మంటిని నుండి మనిషిని - నిర్మించినవాడనేనే 

నరుని ఆత్మ దీపాన్ని - వెలిగించినవాడను నేనే 

నా ఆజ్ఞను అతిక్రమించి - పాపులైనారు 

దోషభరిత ప్రజలై - మరణాన్ని తెచ్చారు 

ఓ ఆకాశమా - ఓ భూలోకమా 

 

ఎద్దు తన కామాంధువును ఎరిగియుండగా 

గాడిద తన సోతావన్ని దొడ్డి తెలిసియుండగా 

ఇశ్రాయేలు జనులకు - కేవలము తెలివిలేదు 

సృష్టికర్త దేవునిగూర్చిన యోచన వారికి లేదు 

జీవజాలముల మూటను నన్ను - విసర్జించారు 

నిత్యా తిరుగుబాటు చేయుచు - కొట్టబడినారు 

ఓ ఆకాశమా - ఓ భూలోకమా